Asianet News TeluguAsianet News Telugu

ఇలా ఏడ్చే మగాళ్లను నమ్మొద్దు..: బండి సంజయ్ కన్నీటి ఫోటోలతో సిరిసిల్లలో ప్లెక్సీలు

సిరిసిల్ల :  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోతో సిరిసిల్ల పట్టణంలో వినూత్న ప్లెక్సీలు వెలిసాయి. 

First Published Dec 1, 2022, 3:27 PM IST | Last Updated Dec 1, 2022, 3:27 PM IST

సిరిసిల్ల :  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోతో సిరిసిల్ల పట్టణంలో వినూత్న ప్లెక్సీలు వెలిసాయి. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ బిఎల్ సంతోష్ పేరును ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చేర్చి విచారణకు పిలవడంపై దారుణమంటూ ఇటీవల జరిగిన ఓ బిజెపి సభలో సంజయ్ కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఏడుస్తూ వున్న సంజయ్ ఫోటోతో ''నవ్వే ఆడవాళ్లను ఏడ్చే మగవాళ్లను నమ్మొద్దని పురాణాలు చెబుతున్నాయి'' అంటూ సిరిసిల్లలో ప్లెక్సీలు వెలిసాయి. సిరిసల్ల టౌన్ టీఆర్ఎస్ యూత్ ఈ ప్లెక్సీలను ఏర్పాటుచేసింది.