Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి రద్దీ.. కీసర టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ నెలకొంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత వూరిలో పండుగ జరుపుకునేందుకు జనం భారీగా తరలి వెళ్తున్నారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్యాగ్‌లు సరిగా పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.