Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఇచ్చినమాట నిలబెట్టుకున్నారు...: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి : నేడు సంగారెడ్డి మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుండి ఆన్ లైన్ ద్వారా, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు స్వయంగా పాల్గొని ప్రారంభించనున్నారు. 

First Published Nov 15, 2022, 10:41 AM IST | Last Updated Nov 15, 2022, 10:41 AM IST

సంగారెడ్డి : నేడు సంగారెడ్డి మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుండి ఆన్ లైన్ ద్వారా, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు స్వయంగా పాల్గొని ప్రారంభించనున్నారు. ఈ మేరకు తనకు ప్రభుత్వం నుండి సమాచారం అందిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తన పోరాటం ఫలించి సంగారెడ్డికి మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరుచేసారని... ఇప్పుడు అదే కాలేజీ ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ హామీ ఇచ్చారని... ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకున్నారని అన్నారు.  కాబట్టి సంగారెడ్డి ప్రజల పక్షాన స్థానిక ఎమ్మెల్యేగా సిఎం కేసీఆర్,  మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజలు వైద్యంకోసం హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన బాధ తప్పిందన్నారు. నిరుపేదలకు ఇక్కడే మంచి ట్రీట్మెంట్ లభిస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.