కరీంనగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా

కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వల విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన కు దిగారు. 

First Published Nov 12, 2020, 4:39 PM IST | Last Updated Nov 12, 2020, 4:39 PM IST

కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వల విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన కు దిగారు. రైతు మహా ప్రదర్శన పేరిట చేపట్టిన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన కు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొన్నం ప్రభాకర్ తో పాటుగా కాంగ్రేస్ నాయకులు కలెక్టరేట్ గెట్ ఎక్కి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.