Asianet News TeluguAsianet News Telugu

1200మంది వలసకార్మికులతో బయల్దేరిన ప్రత్యేక రైలు.. హైదరాబాద్ నుండి జార్ఖండ్ కి..

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ కందిఐఐటీలో చిక్కుకుపోయిన జార్ఖండ్ వలసకార్మికులను ప్రత్యేక రైలులో శుక్రవారం తరలించారు. 

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ కందిఐఐటీలో చిక్కుకుపోయిన జార్ఖండ్ వలసకార్మికులను ప్రత్యేక రైలులో శుక్రవారం తరలించారు. ఇవాళ ఉదయం 56 ప్రత్యేక బస్సుల్లో లింగంపల్లి రైల్వే స్టేషన్ కు  తరలించారు. లింగంపల్లి నుండి జార్ఖండ్లోని హటియాకు 1200మంది వలసకార్మికులను తీసుకుని ప్రత్యేక రైలు బయలుదేరింది. 24 కోచ్ ల ఈ రైలులో, కరోనా నేపథ్యంలో ప్రతీ కోచ్ లో 54 మందిని మాత్రమే ఎక్కించారు. వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.