Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో దొంగల బీభత్సం... దేవుడి ఆభరణాలు, హుండీలో నగదు ఛోరీ

కరీంనగర్ పట్టణంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. 

First Published Dec 25, 2022, 4:03 PM IST | Last Updated Dec 25, 2022, 4:03 PM IST

కరీంనగర్ పట్టణంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ముసుగులు ధరించి కరీంనగర్ కమాన్ వద్దగల రామేశ్వర ఆలయం వద్దకు చేరుకున్న దొంగలు వాచ్ మెన్ సత్తయ్యపై దాడికి పాల్పడ్డారు. అతడు స్పృహ తప్పి పడిపోయాక ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీలోని నగదు, దేవుడి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఆలయ దోపిడీపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.