Asianet News TeluguAsianet News Telugu

ఏటిఎం మిషన్ పై గొడ్డలి వేటు... ఈ దొంగలు మహా ముదుర్లలా వున్నారే..!

పెద్దపల్లి : అర్ధరాత్రి బ్యాంక్ ఏటిఎంను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేసారు దొంగలు. 

First Published Aug 20, 2023, 5:47 PM IST | Last Updated Aug 20, 2023, 5:47 PM IST

పెద్దపల్లి : అర్ధరాత్రి బ్యాంక్ ఏటిఎంను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేసారు దొంగలు. ఏటిఎం మిషన్ ను ద్వంసం చేస్తుండగా సెక్యూరిటీ అలారం మోగడంతో దొంగలు పరారయ్యారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ లోని ఎస్బిఐ ఏటిఎంలో దొంగతనం కోసం ప్రయత్నించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. ఇద్దరు దొంగలు గొడ్డలితో ఏటిఎం మిషన్ తెరిచేందుకు  విశ్వప్రయత్నం చేసారు. కానీ మిషన్  తెరుచుకోకపోగా అలారం మోగడంతో బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిసి కెమెరా వీడియో ఆదారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.