జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి, మరొఇద్దరికి గాయాలు..
కరీంనగర్ : జిల్లాలోని మానకొండూర్ మండలం కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి 563పై కారు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొక్కరికి తీవ్ర గాయాలైనాయి.
కరీంనగర్ : జిల్లాలోని మానకొండూర్ మండలం కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి 563పై కారు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొక్కరికి తీవ్ర గాయాలైనాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం వరంగల్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు... కరీంనగర్ వైపు నుండి వరంగల్ వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరొక్కరు ఆస్పత్రికి తరలించాక చికిత్స పొందుతూ మృతి చెందారు. సురేందర్ (45),మాధవి (40) మృతి చెందగా.. మేఘన,అశోక్ కి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.