రామగుండం ఫ్యాక్టరీ ఉద్యోగాల కుంభకోణం... బహిరంగ చర్చకు బయలుదేరిన ఎమ్మెల్యే కోరుకంటి

పెద్దపల్లి : రామగుండం పర్టిలైజర్ ఆండ్ కెమికల్ లిమిటెడ్ (RFCL) ఉద్యోగాల వివాదం గోదావరిఖనిలో అగ్గి రాజేసింది. 

First Published Aug 4, 2022, 1:04 PM IST | Last Updated Aug 4, 2022, 1:04 PM IST

పెద్దపల్లి : రామగుండం పర్టిలైజర్ ఆండ్ కెమికల్ లిమిటెడ్ (RFCL) ఉద్యోగాల వివాదం గోదావరిఖనిలో అగ్గి రాజేసింది. ఈ కంపనీలో  పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాను ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదని నిరూపించుకునేందుకు ఎమ్మెల్యే కూడా సిద్దమయ్యారు. ఆర్ఎఫ్ సిఎల్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకల్లో తన ప్రమేయమేమీ లేదని నిరూపించేందుకు ఫ్యాక్టరీ ముందే బహిరంగ చర్చకు ఎమ్మెల్యే కోరుకొంటి భారీగా అనుచరులతో  బయలుదేరారు.  

అయితే ఎమ్మెల్యే చందర్ ఫ్యాక్టరీ వద్దకు వెళితే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే ఓపెన్ టాప్ జీప్ లో ఆర్ఎఫ్ సిఎల్ కార్యాలయానికి వెళ్లడానికి సిద్దపడగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు మద్య వాగ్వాదం చోటుచేసుకుని క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.