Asianet News TeluguAsianet News Telugu

రామగుండం ఉద్యోగాల స్కాం... నిరాహారదీక్షకు సిద్దమైన బిజెపి నేత సోమారపు గృహనిర్భందం

పెద్దపల్లి : రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) లో ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగులకు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత సోమారపు సత్యనారాయణ అండగా నిలిచారు.

First Published Aug 2, 2022, 12:21 PM IST | Last Updated Aug 2, 2022, 12:21 PM IST

పెద్దపల్లి : రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) లో ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగులకు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత సోమారపు సత్యనారాయణ అండగా నిలిచారు. మోసపోయిన ఉద్యోగుల పక్షాన ఇవాళ (మంగళవారం) గోదావరిఖనిలో నిరాహారదీక్షకు సిద్దమైన సత్యనారాయణను పోలీసులు గృహనిర్భంధం చేసారు. నిరాహార దీక్ష కోసం ఏర్పాటుచేసిన స్టేజీ, టెంట్లను తొలగించి అక్కడికి చేరుకున్న బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రామగుండం రాజకీయాలు వేడెక్కాయి. 

రామగుండం ఎరువుల కర్మాగారంలో పర్మనెంట్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతనుండి లక్షలు కాజేసిన వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఉద్యోగాల స్కాంపై సిబిఐ విచారణ జరిపించాలని సత్యనారాయణ డిమాండ్ చేసారు. 500మందిని ఉద్యోగాల పేరిట మోసం చేసారని... వారికి న్యాయం జరిగేవరకు అరెస్టులకు భయపడకుండా పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే సోమారపు స్పష్టం చేసారు.