Asianet News TeluguAsianet News Telugu

భారీ నిధులతో ఆలయ విస్తరణ...

కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ, సరిహద్దు రాష్ట్రాల భక్తులతో విశేష పూజలందుకొంటున్న మహా మహిమాన్విత క్షేత్రం రేకుర్తిలోని స్వయంభు శ్రీ లక్షీనర్సింహ స్వామి ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ, సరిహద్దు రాష్ట్రాల భక్తులతో విశేష పూజలందుకొంటున్న మహా మహిమాన్విత క్షేత్రం రేకుర్తిలోని స్వయంభు శ్రీ లక్షీనర్సింహ స్వామి ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరీంనగర్ పట్టణాన్ని అనుకొని ఉండే ఈ ఆలయాన్ని మరింత సర్వాంగ సుందరంగా  మరో యాదాద్రిలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 2కోట్ల నిధులతో చేపట్టిన ఆలయ విస్తరణ పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు. 

ఈ ఆలయ విస్తరణ పనులకు నిధుల కొరత రాకుండా చూసుకోవాలని... త్వరితగతినపనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి అదేశించారు.  ఈ పనులు పూర్తయితే లక్ష్మీనర్సింహ క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోవడమే కాక భక్తుల అవస్థలు కూడా తీరతాయన్నరు. అటు ఆద్యాత్మికతను... ఇటు స్థానికులకు లబ్దిని చేకూర్చే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Video Top Stories