గోదావరిఖని లో లాక్ డౌన్ తీరును పర్యవేక్షించిన రామగుండం పోలీస్ కమిషనర్
ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను అతిక్రమించకుండా సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచించారు.
ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను అతిక్రమించకుండా సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో లాక్ డౌన్ తీరును ఆయన పర్యవేక్షించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నాలుగు గంటల సమయం లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని ఆ తర్వాత కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.