Asianet News TeluguAsianet News Telugu

రామగుండం ఎన్టిపిసి వద్ద టెన్షన్ టెన్షన్... ఒప్పంద కార్మికులపై లాఠీచార్జ్, పోలీసులపై రాళ్లదాడి

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

First Published Aug 22, 2022, 1:12 PM IST | Last Updated Aug 22, 2022, 1:12 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెలతో (ఆగస్ట్) ఒప్పంద కార్మికుల గడువు ముగుస్తుండటంతో పలు డిమాండ్ల పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చించేందుకు కార్మికులు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టిపిసి గేట్ వద్దకు ఒప్పంద కార్మికులు భారీగా చేరుకోవడంతో వారిని స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఉద్రిక్తత చెలరేగి పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పడంతో భద్రతా దళాలు కార్మికులపై లాఠీ చార్జ్ కు దిగారు. కార్మికులు కూడా పోలీసులపై రాళ్ళదాడికి దిగారు. ఇందులో పదిమంది తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా వుంది.