మంత్రి నిరంజన్ రెడ్డి, స్పీకర్ పోచారం లకు రాఖీ కట్టిన తోబుట్టువులు
సోదరుడిపై ఆడపడుచుల అమితమైన ప్రేమకు, ఇద్దరి ఆప్యాయతానురాగాలకు ప్రతీకగా నిలిచేదే రక్షాబంధన్.
సోదరుడిపై ఆడపడుచుల అమితమైన ప్రేమకు, ఇద్దరి ఆప్యాయతానురాగాలకు ప్రతీకగా నిలిచేదే రక్షాబంధన్. ఈ పండగపూట అన్నదమ్ములకు రాఖీ కట్టి ఆడపడుచులు ప్రేమను చాటుకుంటే... తోబుట్టువులకు తోచిన బహుమతులిచ్చి సోదరులు కూడా ఎప్పుడూ అండగా వుంటానని భరోసా ఇస్తుంటారు. ఇలా ఆడపడుచులు సోదర ప్రేమను చాటుకునే పవిత్రమైన పండగ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కూడా సోదరిమణులు అనసూయమ్మ, సుదర్శనమ్మ, పద్మమ్మ, శశిరేఖ రాఖీ కట్టారు.