సింగరేణిలో గనుల్లోకి వరదనీరు... నిలిచిపోయిన నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

పెద్దపల్లి : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.

First Published Jul 13, 2022, 5:07 PM IST | Last Updated Jul 13, 2022, 5:07 PM IST

పెద్దపల్లి : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో 1,2,3,5 బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ప్రతిరోజు 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ లెక్కన ఇప్పటివరకు నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఇలా బొగ్గు ఉత్పత్తి తగ్గటంతో ఎన్టీపీసీకి గ్రౌండ్ స్టాక్ బొగ్గును సింగరేణి యాజమాన్యం రవాణా చేస్తోంది.