రామగుండం ఎరువుల కర్మాగారంలోకి వర్షపు నీరు... 80వేల బస్తాల యూరియా నీటిపాలు
పెద్దపల్లి : చాలాకాలం మూతపడ్డ తర్వాత ఇటీవలే ప్రారంభమైన రామగుండం ఎరువుల కర్మాగారంలో నాసిరకం పనులు తాజా వర్షాలతో బయటపడ్డాయి.
పెద్దపల్లి : చాలాకాలం మూతపడ్డ తర్వాత ఇటీవలే ప్రారంభమైన రామగుండం ఎరువుల కర్మాగారంలో నాసిరకం పనులు తాజా వర్షాలతో బయటపడ్డాయి. పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులకు అమ్మోనియా బ్యాగింగ్, కన్వేయర్ యూనిట్ సెక్షన్ పైకప్పు లేచిపోయింది. దీంతో వర్షపు నీరు ప్లాంట్ లోకి చేరుకోవడంతో 80వేల బస్తాల యూరియా నీటిలో కరిగిపోయింది. దీంతో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేసారు. దీంతో ఆరు రాష్ట్రాలకు యూరియా సరఫరాకు ఆటంకం కలిగి రైతులకు ఇబ్బందులు తలెత్తనుంది.