Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ 50వ జన్మదినోత్సవం.. పేదల సేవలో..

రాహుల్ గాంధీ 50వ జన్మ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

రాహుల్ గాంధీ 50వ జన్మ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో కేక్ కటింగ్ కాకుండా పేదలకు నిత్యవసరాల పంపిణీ,  అల్పాహార దానం, అన్నదానం, పండ్ల పంపిణీ, బియ్యం పంపిణీ, వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీతో పాటుగా రక్తదానం కార్యక్రమాల ద్వారా ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి నాయకత్వంలో భవిష్యత్తులో ఈ దేశం ముందుకుపోవాలని కోరుకుంటూ కరీంనగర్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.