Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ శివారులో ర్యాగింగ్ కలకలం... జూనియర్ ను చితకబాదిన సీనియర్లు

రంగారెడ్డి : చదువుల నిలయమైన విద్యాసంస్థల్లో ర్యాంగింగ్ భూతం కలవరపెడుతోంది.

First Published Nov 12, 2022, 10:18 AM IST | Last Updated Nov 12, 2022, 10:18 AM IST

రంగారెడ్డి : చదువుల నిలయమైన విద్యాసంస్థల్లో ర్యాంగింగ్ భూతం కలవరపెడుతోంది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ప్రముఖ విద్యాసంస్ధలో సీనియర్లు కొందరు జూనియర్ విద్యార్థితో అతి దారుణంగా వ్యవహరించారు.  ఓ యువకున్ని పట్టుకుని నలుగురైదుగురు సీనియర్లు చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన శంకర్ పల్లి మండలం మొకిల వద్దగల ఇండియన్ బిజినెస్ స్కూల్లో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగినా విద్యార్థిని దారుణంగా కొడుతున్న యువకులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.