తెలంగాణ లాక్ డౌన్ : పనులులేక పస్తులుంటున్న కూలీలు..పోలీసులు ఏం చేశారంటే...

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో రోజుకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

First Published Mar 25, 2020, 12:43 PM IST | Last Updated Mar 25, 2020, 12:43 PM IST

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో రోజుకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఉండే రోజుకూలీ ధారవత్ కుమార్ కుటుంబం రెండురోజులుగా పనులు లేక పస్తులుంటోంది. తెలిసిన వారు ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ, కేటీఆర్ లకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనికి స్పందించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు వారికి అందేలా చేశారు. కీసర పోలీసులు స్వయంగా వచ్చి వారికి అందించారు.