Asianet News TeluguAsianet News Telugu

బాణసంచా బ్యాన్ : పటాకుల్లా మండిపడుతున్న వ్యాపారులు..

రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిల్ పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ జరిపింది.

రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిల్ పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ జరిపింది.ఈ విచారణలో బాణసంచా క్రయ విక్రయాలతో పాటు  కాల్చడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకుండా క్రయ విక్రయాలు జరిపేవారితో పాటు బాణసంచా కాల్చేవారిపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను అనుసరించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బాణసంచాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన  సుప్రీంకోర్టు.. హైకోర్టు నిషేధంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి ఇచ్చి బాణాసంచా వ్యాపారులకు ఊరట కల్పించింది. 

Video Top Stories