కడెం ప్రాజెక్ట్ వద్ద కల్లోలిత పరిస్థితులు... నీటమునిగిన దేవాలయాలు, గ్రామాలు

జగిత్యాల : ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తి  కడెం ప్రాజెక్ట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

First Published Jul 13, 2022, 1:38 PM IST | Last Updated Jul 13, 2022, 1:38 PM IST

జగిత్యాల : ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తి  కడెం ప్రాజెక్ట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు, 7.603 టీఎంసీలు కాగా ఇప్పటికే పూర్తిస్థాయికి చేరుకుంది. ప్రాజెక్ట్ కు ఇన్ ప్లో 5లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ప్లో 3 లక్షల క్యూసెక్కులుగా వుంది. దీంతో 17 గేట్లెత్తి ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువ ప్రాంతంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. నదీతీరంలోని సంతోషిమాత, దత్తాత్రేయ స్వామి ఆలయాలు నీటమునిగాయి. అలాగే తీరప్రాంత గ్రామాల్లోకి నీరుచేరి ఇళ్లు మునకకు గురయ్యాయి. కడెం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉండటంతో తీర ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరించింది. తాజాగా కడెం ప్రాజెక్ట్ ను పరిశీలించారు మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి.