కేసీఆర్ కోసం రెడీ చేయించిన సెల్ ఎక్కడ..?: కరీంనగర్ జైలు సందర్శించిన పొన్నం

కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కోసం కరీంనగర్ జైల్లో గదిని రెడీ చేసామంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు.

First Published Aug 29, 2022, 3:41 PM IST | Last Updated Aug 29, 2022, 5:15 PM IST

కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కోసం కరీంనగర్ జైల్లో గదిని రెడీ చేసామంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ణులతో కలిసి కరీంనగర్ జిల్లా జైలును సందర్శించిన పొన్నం పోలీస్ అధికారులతో కేసీఆర్ కోసం ఏర్పాటుచేసిన గది చూపాలంటూ కోరారు. అయితే కేసీఆర్ కోసం ఎలాంటి గది ఏర్పాటుచేయలేదని జైలు అధికారులు చెప్పినట్లు పొన్నం తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామని బిజెపి ఎప్పటినుండో చెబుతోందని... ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరో అడుగు ముందుకేసి కరీంనగర్ జైల్లో గదిని కూడా ఏర్పాటుచేసామంటూ మరో అబద్దాన్ని ప్రచారం చేయడం ప్రారంభించాడని అన్నారు. మాయమాటలు, అబద్దాలతో బిజెపి నాయకులు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో బయటపెట్టడానికే జైలును సందర్శించినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.