వేములవాడ బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతం... తల్లిఒడికి చేరిన పసికందు
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద ఓ తల్లిఒడిలోని చిన్నారి కిడ్నాప్ కు గురయిన ఘటన కలకలం రేపింది. పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన బాలుడి ఆఛూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ ను గుర్తించారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు బాలున్ని తల్లిఒడికి చేర్చారు.
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద ఓ తల్లిఒడిలోని చిన్నారి కిడ్నాప్ కు గురయిన ఘటన కలకలం రేపింది. పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన బాలుడి ఆఛూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ ను గుర్తించారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు బాలున్ని తల్లిఒడికి చేర్చారు. కిడ్నాపర్ తిరుపతిలోని అలిపిరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన లావణ్య భర్తతో గొడవపడి 21రోజుల పసిగుడ్డుతో రాజన్న ఆలయం వద్దకుచేరుకుంది. అక్కడే మెట్ల వద్ద వుంటున్న ఆమెకు మాయమాటలతో నమ్మించి ఓ వ్యక్తి పసిపాపను తీసుకుని పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన మూడు రెస్క్యూ బృందాలు చిన్నారి ఆఛూకీ కోసం తీవ్రంగా గాలించి ఎట్టకేలకు కిడ్నాపర్ ను పట్టుకున్నారు. తన బిడ్డను క్షేమంగా ఒడికి చేర్చిన పోలీసులకు సదరు మహిళ ధన్యవాదాలు తెలిపింది.