Asianet News TeluguAsianet News Telugu

కిలాడీ జంట... కలకలం సృష్టించిన వరుస దొంగతనాల కేసులో భార్యాభర్తల అరెస్ట్..!

 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడిన భార్యా, భర్తలను పోలీసులు ఆరెస్ట్ చేశారు. 

First Published Sep 4, 2022, 9:28 AM IST | Last Updated Sep 4, 2022, 9:28 AM IST

 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడిన భార్యా, భర్తలను పోలీసులు ఆరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 37.8 తులాల బంగారం, 32 తులాల వెండితో పాటు 11 వేల 500   నగదు రికవరీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన  తాళ్ళపల్లి ధనలక్ష్మి, ప్రసాద్ లు గతంలో  వేములవాడ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడినారు. ఈ క్రమంలో పోలీసుల పరిశీలనలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన ధనలక్ష్మి, ప్రసాద్ లను గుర్తించి వారిని ఆరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ . . .  వేములవాడ పట్టణంలో జరిగిన ఓ దొంగతనం కేసు విచారణలో భాగంగా సిసి టీవి కెమెరాల పరిశీలనలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్యా,భర్తలు ధనలక్ష్మి, ప్రసాద్ లుగా గుర్తించి వారిని బెల్లంపల్లిలో ఆరెస్ట్ చేశామన్నారు. వారిని విచారించగా, ఈ ప్రాంతంలో పలు దొంగతనాలు కూడా చేసినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ధనలక్ష్మి ఇటీవల  జైలు కు వెళ్ళి వచ్చిన తరువాత కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామని ఆయన  వివరించారు. వీరి వద్దనుండి  37.8 తులాల బంగారం, 32 తులాల వెండితో పాటు 11 వేల 500  నగదు రికవరీ చేసుకున్నట్లు ఆయన వివరించారు. ప్రజలేవ్వరు కూడా అధిక మొత్తంలో డబ్బులను ఇంటిలో ఉంచుకోకూడదని ఆయన సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గరలో గల పోలీస్ స్టేషనుకు సమాచారం అందించాలని, ప్రజలు కూడా ప్రతి వాడలో సిసి కెమెరాలను అమర్చుకున్నట్లైతే దొంగతనాలకు ఆస్కారం ఉండదని ఆయన సూచించారు.