100మంది కవులతో... సర్దార్ సర్వాయి పాపన్నపై కవితా సంకలనం


హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా నాలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 100మంది కవులు బహుజన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నపై రూపొందించిన కవితా సంకలనాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.  

First Published Jun 13, 2021, 11:08 AM IST | Last Updated Jun 13, 2021, 11:08 AM IST


హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా నాలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 100మంది కవులు బహుజన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నపై రూపొందించిన కవితా సంకలనాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.  హైదరాబాద్ లోని తన నివాసంలో తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.   

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... అన్ని కులాలను, మతాలను సమానంగా ఆదరించిన గొప్ప బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని అభివర్ణించారు. ఈ కవితా సంకలన ఆవిష్కరణ కార్యక్రమంలో బడేసాబ్, ఓంకార్, మల్లయ్య, శ్రీనయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.