Asianet News TeluguAsianet News Telugu

పదితలల రావణాసురుడిలా ప్రధాని మోదీ... రామగుండంలో ప్లెక్సీల కలకలం

పెద్దపల్లి : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తెలంగాణకు మళ్లీ ప్లెక్సీ వార్ మొదలయ్యింది. 

First Published Nov 12, 2022, 10:01 AM IST | Last Updated Nov 12, 2022, 10:01 AM IST

పెద్దపల్లి : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తెలంగాణకు మళ్లీ ప్లెక్సీ వార్ మొదలయ్యింది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రధాని ఇవాళ తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ బిజెపి శ్రేణులు ప్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటుచేయగా... తెలంగాణలో ప్రధానికి నో ఎంట్రీ, రావణాసురుడిలా పదితలల మోదీ ఫోటోలతో ప్లెక్సీలు వెలిసాయి. సింగరేణి బొగ్గుగనులను అమ్మకం,  ఐటిఐఆర్ ప్రాజెక్ట్, మిషన్ భగీరథకు నిధులు, టెక్స్ టైల్ పార్క్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజ్ హామీలపై ప్రధానిని ప్రశ్నిస్తూ ప్లెక్సీలు వెలిసాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్లుగా పేర్కొంటూ రామగుండంలో ప్లెక్సీలు వెలిసారు.