Asianet News TeluguAsianet News Telugu

మల్లికార్జున స్వామిపై ప్రమాణానికి సిద్దమా..: పెద్దపల్లి ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్

పెద్దపల్లి :  అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సంచలన ఆరోపణలు చేసారు. 

పెద్దపల్లి :  అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సంచలన ఆరోపణలు చేసారు. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నవారితో ఎమ్మెల్యేకు సంబంధాలున్నాయని... వారినుండి మనోహర్ రెడ్డి భారీగా డబ్బులు తీసుకుంటారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. నిజంగా మనోహర్ రెడ్డి అక్రమార్కులకు అండగా లేకుంటే ఈ ఆదివారం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అండతో సాగుతున్న అక్రమ ఇసుక రవాణా లారీల ప్రయాణంవల్లే రోడ్లు దెబ్బతింటున్నాయని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు.