రేవంత్ కి వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియదు.. ఎమ్మెల్యీ జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. పీసీసీ చీఫ్ అనే పదవిలో ఉన్నవారు కేవలం సమన్వయకర్తలు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తామంతా సోనియా నాయకత్వం లో పని చేస్తున్నామని, అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన పరిధి మేరకు పని చేస్తున్నాదాని ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ కి వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదని, కానీ దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ... హుజురాబాద్, మునుగోడులను రెండూ ఒకేలా చూడలేమని, మునుగోడు తమ సిట్టింగ్ సీట్ అని ఆయన అన్నారు.