పుట్టినరోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్.... మొక్క నాటిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా

తన పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

First Published Jul 11, 2022, 5:19 PM IST | Last Updated Jul 11, 2022, 5:19 PM IST

తన పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తమ పార్టీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ ఛాలెంజ్ ను స్వీకరించి నాంపల్లిలోని రైతు బంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో రాజేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. హరితహారంతో తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో సంతోష్ కొనసాగిస్తున్నారని అన్నారు. ఇందులో తాను పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా వుందన్నారు.