Asianet News TeluguAsianet News Telugu

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఢీ... రాష్ట్రంలోని జాతీయ రహదారులను దిగ్బంధించిన టీఆర్ఎస్

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆందోళనల బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ(బుధవారం) జాతీయ రహదారుల దిగ్బందానికి టీఆఎస్ పిలుపునిచ్చింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రంమీదుగా వెళ్లే జాతీయరహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఇలా మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని బూత్పూరు వద్ద వేలాదిమంది కార్యకర్తలతో బెంగుళూరు జాతీయ రహదారి దిగ్భంధించారు. ఈ నిరసనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అల వెంకటేశ్వర రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆధ్వర్యంలో నాగ్ పూర్ జాతీయ ర‌హదారిపై క‌డ్తాల్ జంక్ష‌న్ వ‌ద్ద  రైతులు, టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిదులు, కార్య‌క‌ర్త‌లు రాస్తారోకో నిర్వ‌హించారు. జాతీయ ర‌హ‌దారిపై బైటాయించి కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.   
 
First Published Apr 6, 2022, 2:13 PM IST | Last Updated Apr 6, 2022, 2:13 PM IST