Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం... కార్మికుడు మృతి, మరొకరికి గాయాలు

పెద్దపల్లి : సింగరేణి బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందగా మరో కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 

First Published Aug 18, 2023, 2:58 PM IST | Last Updated Aug 18, 2023, 2:58 PM IST

పెద్దపల్లి : సింగరేణి బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందగా మరో కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 11ఏ గనిలో గురువారం రాత్రి సైడ్ వాల్ కూలి కార్మికులపై పడింది. దీంతో కాంట్రాక్ట్ కార్మికుడు కృష్ణమురారి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో కార్మికుడు గోపాల్ తీవ్రంగా గాయపడగా అతడిని గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే వున్నట్లు సమాచారం. బొగ్గుగని ప్రమాదంలో మృతిచెందిన కృష్ణమురారి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యంపై కార్మికుల సేప్టీని పట్టించుకోకుండా పనిచేయించడంపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే కార్మికుడి మృతికి కారణమని... అతడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే చందర్ డిమాండ్ చేసారు.