Asianet News TeluguAsianet News Telugu

ఇది కదా అసలైన సోదరప్రేమ... తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడిచిన వృద్ద సోదరి

జగిత్యాల : సోదర సోదరీమణులు ప్రేమానురాగాల పండగ రాఖీ.

First Published Aug 31, 2023, 11:36 AM IST | Last Updated Aug 31, 2023, 11:35 AM IST

జగిత్యాల : సోదర సోదరీమణులు ప్రేమానురాగాల పండగ రాఖీ. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు పుట్టింటికి వెళుతుంటారు. ఇలా తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 8కిలో మీటర్లు నడిచి సోదర ప్రేమను చాటుకుంది ఓ వృద్దురాలు. రక్త సంబంధాలను పట్టించుకోని ఈ కలికాలంలో ఆరోగ్యం సహకరించని వయసులోనూ ఈ అక్క చూపించిన సోదరప్రేమ అందరినీ కదిలిస్తోంది. వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు  బక్కవ్వ రాఖీ పండక్కి పుట్టింటికి వెళ్లాలని భావించింది. అయితే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లిలో వెళ్లేందుకు ఎలాంటి సదుపాయం లేకపోవడంతో ఆమె కాలినడకన పుట్టింటికి వెళ్లింది. ఇలా 8 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి తమ్ముడు గౌడ మల్లేశంకు రాఖీ కట్టి సోదరప్రేమను చాటుకుంది బక్కవ్వ.