సూర్యాపేట ఎన్నారై దాతృత్వం... ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ బహూకరణ
సూర్యాపేట: కరోనా రెండో దశ ఉదృతం అవుతున్న వేళ అక్సిజన్ ను అందుబాటులో ఉంచడానికి సూర్యాపేట జిల్లాకు ఎన్నారై మహేందర్ రెడ్డి ముందుకువచ్చారు.
సూర్యాపేట: కరోనా రెండో దశ ఉదృతం అవుతున్న వేళ అక్సిజన్ ను అందుబాటులో ఉంచడానికి సూర్యాపేట జిల్లాకు ఎన్నారై మహేందర్ రెడ్డి ముందుకువచ్చారు. సూర్యాపేట మెడికల్ కళాశాలకు 10 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను మహేందర్ రెడ్డి బహుకరించారు. వాటిని శనివారం ఉదయం మెడికల్ కళాశాల ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... సూర్యాపేట, నల్లగొండలలో నెలకొల్పిన మెడికల్ కళాశాలలు ఇప్పుడు వయస్సుతో నిమిత్తం లేకుండా కరోనా పేషేంట్ల ప్రాణం నిలుపుతున్నాయన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు, ఆలోచనలే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.