Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో కలకలం... ఓ యువకుడి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

కరీంనగర్ : తెలంగాణలో మరోసారి నిషేధిత పిఎఫ్ఐ సంస్థ కదలికలు బయటపడటం కలకలం రేపుతోంది. 

First Published Aug 10, 2023, 9:06 PM IST | Last Updated Aug 10, 2023, 9:06 PM IST

కరీంనగర్ : తెలంగాణలో మరోసారి నిషేధిత పిఎఫ్ఐ సంస్థ కదలికలు బయటపడటం కలకలం రేపుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇవాళ ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ సోదాలు చేపట్టింది. ప్రస్తుతం విదేశాల్లో వుంటున్న కరీంనగర్ హుస్సెన్ పురాకు చెందిన యువకుడికి నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ) తో సంబంధాలున్నట్లు బయటపడింది. దీంతో కరీంనగర్ లోని అతడి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయమే స్థానిక పోలీసులతో కలిసి అనుమానితుడి ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ బృందం సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టింది.