Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్... ప్రియుడితో కలిసి యువతి వీడియో

సిరిసిల్ల : ఇవాళ తెల్లవారుజామున రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

First Published Dec 20, 2022, 3:55 PM IST | Last Updated Dec 20, 2022, 3:55 PM IST

సిరిసిల్ల : ఇవాళ తెల్లవారుజామున రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన శాలిని(18) తండ్రి చంద్రయ్యతో కలిసి గ్రామంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలుచేసి తిరిగి వెళుతుండగా కారులో వచ్చిన కొందరు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళారు. దీంతో ఇది కిడ్నాప్ గా అందరూ భావిస్తుండగా యువతి ఓ వీడియోను బయటపెట్టి  అందరికీ షాకిచ్చింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని... తాను ప్రేమించిన వాడితో కలిసి వెళ్ళినట్లు శాలిని తెలిపింది. మూడేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని... ఏడాది క్రితమే పెళ్ళి చేసుకోగా మైనర్ కావడంతో ఆ వివాహం చెల్లలేదని తెలిపింది. దీంతో తన తల్లిదండ్రులు ప్రేమించినవాడిపై కేసులు పెట్టి జైలుకు పంపారని యువతి వెల్లడించింది. కేవలం
దళితుడు కావడం వల్లే ప్రేమించివాడికిచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని శాలిని తెలిపింది. తాజాగా ప్రియుడిని పెళ్లాడిని శాలిని అతడితో కలిసి ఓ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. తెల్లవారుజామున తనను తీసుకుని వెళ్లడానికి వచ్చిన ప్రియుడు మాస్క్ ధరించి వుండటంతో గుర్తించలేకపోయానని... అందువల్లే ప్రతిఘటించినట్లు తెలిపింది.  తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని... ప్రియుడితో తన పెళ్లి జరిగినట్లు శాలిని వెల్లడించింది.