కరీంనగర్ జిల్లాకు నూతన కలెక్టరేట్ నిర్మాణానికి మంత్రి గంగుల శంకుస్థాపన
కరీంనగర్ లో రూ.51 కోట్లతో నిర్మించనున్న జిల్లా సమీకృత కార్యాలయాల భవన నిర్మాణ పనులకు బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేసారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంలో ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ కొనసాగుతోందని... ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని... అందుకే కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. సంవత్సరంలోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇందుకోసం ప్రతి నెలా నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు.