Asianet News TeluguAsianet News Telugu

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి... నల్గొండ వాసుల ఆందోళన

నల్గొండ : రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదీ ప్రవాహం పెరిగి ప్రమాదాలకు దారితీస్తోంది.

First Published Sep 8, 2022, 3:16 PM IST | Last Updated Sep 8, 2022, 3:16 PM IST

నల్గొండ : రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదీ ప్రవాహం పెరిగి ప్రమాదాలకు దారితీస్తోంది. వరద నీరు భారీగా చేరి నాగార్జున సాగర్ నిండుకుండలా మారడంతో ఎడమ కాలువకు గండి పడింది. భారీగా నీటిని కాలువలోకి వదలడంతో ఆ ప్రవాహ దాటికి భారీ గండి పడింది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద సాగర్ కాలువకు భారీ గండిపడి పంటపొలాల్లోకి నీరు చేరింది. జనవాసాల్లోకి కూడా వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ అనుకోని పరిణామంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.