Asianet News TeluguAsianet News Telugu

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ... కిందకు దూకుతున్న నీటితో సాగర్ అందాలు కనువిందు

నల్గొండ: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 

నల్గొండ: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా సాగర్ లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో  2,16,137 క్యూసెక్కులుగా వుండగా అవుట్ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా వుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులుగా వుంది. సాగర్ పూర్తిస్థాయి  సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా వుంది. ఇలా ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో 10 క్రస్ట్ గేట్లు ఐదు ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.