Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూతురు మరో షాక్... చేర్యాలలో వెలిసిన నోటీస్ బోర్డులు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై సొంత కూతురు తుల్జాభవాని భూకబ్జా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు.

First Published Jun 25, 2023, 1:35 PM IST | Last Updated Jun 25, 2023, 1:35 PM IST

జనగామ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సొంత కూతురు షాక్ ల మీద షాక్ ఇస్తోంది. ఇప్పటికే తన సంతకం ఫోర్జరీ చేసి చేర్యాలలో భూమిని కబ్జాచేసాడంటూ తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదుచేసింది ఎమ్మెల్యే కూతురు తుల్జాభవాని. అలాగే ఇటీవల అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తండ్రిని అందరిముందే పట్టుకుని నిలదీసారు. తాజాగా తండ్రి కబ్జా చేసి తనపేరిట రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని చేర్యాల మున్సిపాలిటికీకి అప్పగించినున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుతో ఉన్న భూమి చుట్టూ గల ప్రహారీ గోడను మరికొందరితో కలిసి  కూల్చివేశారు. 

ఈ సందర్భంగా చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవాని పేరిట ఓ నోటీస్ బోర్డ్ వెలిసింది. ''నా తండ్రి ఊరి భూమిని కబ్జాచేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చెర్యాల ప్రజలను క్షమించమని అడుగుతున్నా. నా తండ్రి నా పేరున పెట్టిన యావదాస్తిని చెర్యాల మున్సిపాలిటీకి, చెర్యాల హాస్పిటల్ కు  రిజిస్ట్రేషన్ చేయుచున్నారు'' అంటూ తుల్జాభవాని పేరిట ఈ నోటీస్ వెలిసింది.