Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో జోరుగా పోలింగ్ ... వీల్ చెయిర్ వచ్చిమరీ ఓటేస్తున్న వృద్దులు

మునుగోడు ఉపఎన్నికలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 7గంటల నుండి ప్రశాంతంగా కొనసాగుతోంది.

First Published Nov 3, 2022, 9:11 AM IST | Last Updated Nov 3, 2022, 9:11 AM IST

మునుగోడు ఉపఎన్నికలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 7గంటల నుండి ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సతీసమేతంగా 
సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగవారి గూడెం పోలింగ్ బూత్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా చండూరు మండలం ఇడికూడలో ఓటేసారు.   

మనుగోడు వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతులవద్ద ఓటర్ల క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఓటేసేందుకు వృద్దులు, మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. నడవలేని స్థితిలో కూడా వీల్ చెయిర్ పై వచ్చి ఓటేసి చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు కొందరు వృద్దులు. ఇక నారాయణపూర్ మండలం సర్వేల్ లో కేవలం మహిళల కోసమే ఏర్పాటుచేసిన సఖి పోలింగ్ కేంద్రాన్ని అభ్వర్వర్ ముల్లముడి సమత సందర్శించి మొదటి ఓటర్ ను అభినందించారు.