మునుగోడు ఉపఎన్నిక ... మంత్రి ఎర్రబెల్లి కారులో పోలీసుల తనిఖీలు

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

First Published Oct 20, 2022, 12:18 PM IST | Last Updated Oct 20, 2022, 12:18 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరిగేలా చర్యలుతీసుకుంటున్న పోలీసులు మునుగోడు నియోజకవర్గం చుట్టూ చెక్ పోస్టుల ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ క్రమంలో పలిమెల చెక్ పోస్ట్ వద్ద రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ను సైతం వదిలిపెట్టకుండా తనిఖీ నిర్వహించారు. మంత్రితో పాటు కాన్వాయ్ వాహనాలన్నింటి ఆపి తనిఖీ చేసిన తర్వాతే పంపించారు పోలీసులు. మంత్రి ఎర్రబెల్లి కూడా పోలీసులకు పూర్తిగా సహకరించారు.