పోలీస్ వలయంలో మునుగోడు ... చివరకు మంత్రి ఎర్రబెల్లినీ వదిలిపెట్టలేదే..!

నల్గొండ : తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మనుగోడు ఉపఎన్నిక చుట్టూ తిరుగుతోంది.

First Published Oct 27, 2022, 1:44 PM IST | Last Updated Oct 27, 2022, 1:52 PM IST

నల్గొండ : తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మనుగోడు ఉపఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ప్రధాన పార్టీలన్ని ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రచారం చేస్తున్నారు. అయితే ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు, మద్యాన్ని తీసుకురాకుండా పోలీసులు మునుగోడు చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటుచేసారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చే వాహనాలను ఈ చెక్ పోస్టుల వద్ద ఆపి తనిఖీచేసాకే వదిలిపెడుతున్నారు. ఇలా తాజాగా టీఆర్ఎస్ ప్రచారానికి వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. 
లక్కలపల్లి చెక్ పోస్ట్ వద్ద మంత్రి ప్రయాణిస్తున్న కారుతో పాటు కాన్వాయ్ లోని వాహనాలను తనిఖీ చేసారు పోలీసులు. మంత్రి ఎర్రబెల్లి కారులోని బ్యాగులతో పాటు ఇతర వాహనాల్లోనూ సోదా చేసారు. పోలీసులకు మంత్రితో పాటు ఆయన సిబ్బంది పూర్తిగా సహకరించారు. ఈ తనిఖీ అనంతరం  మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ ను పోలీసులు వదిలిపెట్టారు.