పోలీస్ పహారాలో మునుగోడు ... మంత్రి ఎర్రబెల్లిని సైతం వదలని పోలీసులు

నల్గొండ : ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం పోలీస్ పహారాలోకి వెళ్లింది. 

First Published Oct 21, 2022, 3:13 PM IST | Last Updated Oct 21, 2022, 3:13 PM IST

నల్గొండ : ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం పోలీస్ పహారాలోకి వెళ్లింది. మద్యం, ధన ప్రవాహాన్ని అడ్డుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మునుగోడుకు వెళ్లే దారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీ చేపడుతున్నారు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను కూడా తనిఖీ చేసాకే మునుగోడులోకి అనుమతిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రచారానికి వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సింగారం చెక్ పోస్ట్ వద్ద ఆపిన పోలీసులు ఆయన కారుతో పాటు కాన్వాయ్ లోని మిగతా వాహనాలను చెక్ చేసారు. మంత్రి ఎర్రబెల్లి కూడా తనిఖీ సమయంలో పోలీసులకు పూర్తిగా సహకరించారు.