మునుగోడులో ఉద్రిక్తత ... బిజెపి కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
నల్గొండ : ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా మునుగోడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నల్గొండ : ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా మునుగోడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు స్థానికేతరులతో కలిసి డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ... వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు పోలింగ్ బూత్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. దీంతో ఆందోళనకు దిగిన బిజెపి నాయకులు చెల్లాచెదురయ్యారు.