మునుగోడోడి మాటంటే మాటే... ఎన్నడూ తప్పిందేలే...: ఈ మాటలింటే బిజెపికి పూనకాలే
నల్గొండ : తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలుండటంతో మునుగోడు ఉపఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
నల్గొండ : తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలుండటంతో మునుగోడు ఉపఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ నాయకులంతా మునుగోడు బాట పట్టారు. ఇలా కొనసాగుతున్న ప్రచారపర్వంలో కొందరు ఓటర్లు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపేలా మాట్లాడుతున్నారు. ఇలా బిజెపికి మద్దతుగా ఓ ముసలాయన మాటలు బిజెపి శ్రేణులకు బూస్ట్ ను ఇచ్చేలా వున్నాయి. బిజెపి నాయకులు ప్రచారంలో భాగంగా ఓ వృద్దుడిని ఏ పార్టీకి ఓటేస్తావని అడగ్గా పువ్వుగుర్తుకు వేస్తానని చెప్పాడు. అధికార పార్టీవాళ్లు బయపెట్టినా, డబ్బులిచ్చినా, మద్యం పంచినా లొంగిపోనని... మునుగోడోడి మాటంటే మాటేనని... తప్పిందిలేదని అన్నాడు. ఏదేమైనా తాను పువ్వు గుర్తుకే ఓటేస్తానంటూ వృద్దుడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు.