హీటెక్కిన మునుగోడు పాలిటిక్స్... చండూరులో కాంగ్రెస్ కార్యాలయం దగ్దం

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చండూరులో ఇటీవలే ఏర్పాటుచేసిన కాంగ్రెస్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి.

First Published Oct 11, 2022, 3:25 PM IST | Last Updated Oct 11, 2022, 3:25 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చండూరులో ఇటీవలే ఏర్పాటుచేసిన కాంగ్రెస్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని దుండగులు ఉపఎన్నిక ప్రచారం కోసం దాచిన కాంగ్రెస్ ప్రచార సామాగ్రికి నిప్పంటించారు. దీంతో కొంతమేరకు ప్రచార సామాగ్రి దగ్దమయ్యింది. ఇవాళ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు పర్యటన నేపథ్యంలో భారీగా ప్రచార సామాగ్రిని కార్యాలయంలో వుంచారు. ఈ విషయం తెలిసి ప్రత్యర్థి పార్టీలే ఈ దుశ్చర్యకు పాల్పడివుంటారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 

మునుగోడు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అగ్నిప్రమాదం జరిగిన కార్యాలయాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా లేక ఎవరైనా కావాలనే చేసారా అన్నది తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.