మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శ్రీకారం... కోకాపేటలో మంత్రి గంగుల భూమి పూజ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం కోసం హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఐదెకరాల భూమిని కేసీఆర్ సర్కార్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఇవాళ భూమి పూజ చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల సమక్షంలో భూమిపూజ చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ఐదు కోట్లకు మరో రూ.120 కోట్లు కలిపి మొత్తం రూ.125 కోట్లతో ఆరు అంతస్తుల అత్యాధునిక ఆరు టవర్లను నిర్మించాలని మున్నూరు కాపు ప్రతినిధులు నిర్ణయించారు. మున్నూరు కాపు విద్యార్థులు, నాయకులు, సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చేవారికి ఈ భవనలో సౌకర్యాలు కల్పించనున్నారు.