కసాయి తల్లి కిరాతకం... కన్న కొడుకును బావిలో పడేసి హత్య
పెద్దపల్లి జిల్లాలో అమ్మతనానికే మచ్చలా నిలిచే సంఘటన చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో అమ్మతనానికే మచ్చలా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. పేగు బంధాన్ని మరిచిన ఓ కసాయి తల్లి కన్నబిడ్డను అతి కిరాతకంగా హతమార్చింది. పెద్దపల్లిలోని మొగల్ పురా కు చెందిన శ్యామల కొడుకు యస్వంత్(14)ను వ్యవసాయ బావిలో నెట్టి చంపింది. ఆస్పత్రికి తీసుకుని వెళుతున్నానని కుటుంబసభ్యులకు చెప్పి వ్యవసాయ బావివద్దకు తీసుకెళ్లి తోసేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకుని బాలుడి డెడ్ బాడీని బయటకు తీయించారు. అనంతరం నిందితురాలు శ్యామలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.