ప్రధాని తెలంగాణ పర్యటన వేళ... హైదరాబాద్ లో 'మోదీ నో ఎంట్రీ' ప్లెక్సీల కలకలం
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో 'మోదీ నో ఎంట్రీ' అంటూ వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో 'మోదీ నో ఎంట్రీ' అంటూ వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్తువులపై విధించిన 5 జీఎస్టిని రద్దు చేసాకే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలంటూ చేనేత యూత్ ఫోర్స్ పేరిట పెక్సీలు వెలిసాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ ఫోస్ట్ వద్ద ఇలా నో ఎంట్రీ మోదీ ప్లెక్సీలు కనిపిస్తున్నారు.
ఇక ఇప్పటికే మంత్రి కేటీఆర్ చేనేతపై జిఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి పోస్ట్ కార్డ్ లు రాయాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమంలో పాల్గొంటున్నారు. తాజాగా మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఇదే చేనేతపై జీఎస్టి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్లెక్సీలు వెలవడం కలకలం రేపుతోంది. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ పనేనని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.