అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు... మహిళలతో ఆడిపాడిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : తెలంగాణ పూలపండగ బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

First Published Sep 29, 2022, 11:06 AM IST | Last Updated Sep 29, 2022, 11:06 AM IST

హైదరాబాద్ : తెలంగాణ పూలపండగ బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడుచులు బతుకమ్మ ఆటాపాటలతో తెలంగాణ వాడవాడల్లో సందడి నెలకొంది. ఇలా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం కూడా బుధవారం బతుకమ్మ వేడుకలతో కోలాహలంగా మారింది. శాసనసభ, మండలి మహిళా ఉద్యోగులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ అధికారులు పాల్గొన్నారు.  ఇక రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకల్లోనూ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మహిళా న్యాయవాదులతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. నిత్యం వాదోపవాదాలతో బిజీగా వుండే కోర్టు ప్రాంగణం బతుకమ్మ ఆటాపాటలతో సందడిగా మారింది.